Anantapur District: తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Robbers looted Seven Hills Express in anantapur dist
  • అనంతపురం జిల్లా తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • సిగ్నల్ తీగలు కట్ చేసిన దుండగులు
  • రైలు ఆగిన వెంటనే బోగీల్లోకి ప్రవేశం
  • మారణాయుధాలు చూపించి దోపిడీ
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో గత అర్ధరాత్రి దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లో ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

ఎంతమొత్తం దోచుకున్నారన్న దానిపై స్పష్టత లేకున్నప్పటికీ, ఆరు తులాల బంగారు ఆభరణాలు, పెద్దమొత్తంలో నగదు దోచుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలించారు. మరోవైపు, సిగ్నల్ లేని కారణంగా నిలిచిపోయిన రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు.
Anantapur District
Seven Hills Express
Exploitation
Robbers

More Telugu News