తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం భేటీ

Meghalaya CM Conrad Sangma Meets KTR
  • కేటీఆర్ దంపతులను కలిసిన సంగ్మా దంపతులు
  • శాలువా కప్పి సత్కరించిన కేటీఆర్ దంపతులు
  • రెండు రాష్ట్రాల అంశాలపై చర్చ
తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. ఇవాళ ప్రగతి భవన్ లో కేటీఆర్, శైలిమ దంపతులను సంగ్మా దంపతులు కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని సంగ్మా ప్రకటించగా.. సంగ్మాతో సమావేశమవడంపట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Telangana
Meghalaya
Conrad Sangma
KTR
TRS

More Telugu News