మిర్చి కోతకు ఆటోలో వెళ్తుండగా కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం

Road Accident in Hanamkonda three dead
  • హనుమకొండ జిల్లాలో ఘటన
  • క్షతగాత్రుల్లో మరో ముగ్గురి పరిస్థితి విషమం
  • మాందారిపేట వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. బాధితులందరూ రైతు కూలీలే. మిర్చిపంట కోత కోసం పత్తిపాకకు చెందిన రైతులు ఆటోలో వెళ్తుండగా మాందారిపేట వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

మృతులను మంజుల (45), రేణుక (48), విమల (50)గా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hanamkonda
Warangal
Road Accident

More Telugu News