ప‌ద‌వుల‌తో పాటు కాన్వాయ్‌ల‌నూ వ‌దిలేసిన ఏపీ మంత్రులు

ap ministers leaves their convoys
  • జ‌గ‌న్ ఆదేశాల‌తో మంత్రులంతా రాజీనామా
  • ఇంటికెళ్లే సంద‌ర్భంగా కాన్వాయ్‌ల‌ను వ‌దిలేసిన వైనం
  • సొంత వాహ‌నాల్లో బ‌య‌లుదేరిన మంత్రులు
ఏపీ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు... ఇంటికి వెళ్లే సంద‌ర్భంగా త‌మ‌కు ప్ర‌భుత్వం కేటాయించిన కాన్వాయ్‌ల‌ను కూడా వ‌దిలేసి బ‌య‌లుదేరారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం అమ‌రావ‌తి ప‌రిధిలోని ఏపీ స‌చివాల‌యంలో కీల‌క స‌న్నివేశం క‌నిపించింది.

గురువారం మ‌ధ్యాహ్నం. మొద‌లైన కేబినెట్ భేటీలో సీఎం జ‌గ‌న్ ఆదేశించిన మరుక్ష‌ణ‌మే కేబినెట్‌లోని 24 మంది త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. ఈ రాజీనామా లేఖల‌ను వారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌మ‌ర్పించారు. ఆ త‌ర్వాత కేబినెట్ భేటీ ముగియ‌గా.. బ‌య‌ట‌కు వ‌చ్చిన మంత్రులు..మంత్రి హోదాలో ప్ర‌భుత్వం త‌మ‌కు కేటాయించిన కాన్వాయ్ ‌ల‌ను అక్క‌డే వ‌దిలేసి సొంత వాహ‌నాల్లో ఇళ్ల‌కు వెళ్లిపోయారు. కేబినెట్ భేటీకి ముందే మంత్రులంతా తమ చాంబర్లను ఖాళీ చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
AP Cabinet
Amaravati
YS Jagan
AP Ministers

More Telugu News