వెలిగే దీపాన్ని లాక్కెళ్లి దుస్తుల్లో వేసిన ఎలుక... రూ.2 లక్షల నగదు దగ్ధం

Rat caused fire accident in house
  • అహ్మాదాబాద్ లో ఘటన
  • చైత్ర నవరాత్రుల సందర్భంగా దీపం వెలిగించిన వ్యాపారి
  • ఎలుక చేసిన పనికి ఇల్లంతా మంటలు
  • కాలిబూడిదైన నగదు
గుజరాత్ లోని ఓ వ్యాపారి ఇంట్లో విచారకర సంఘటన జరిగింది. అహ్మదాబాద్ కు చెందిన వినోద్ భాయ్ ఓ వ్యాపారి. చైత్ర నవరాత్రుల సందర్భంగా ఆయన తన ఇంట్లో దీపం వెలిగించారు. అయితే, ఓ ఎలుక ఆ దీపాన్ని లాక్కెళ్లి ఇంట్లో ఉన్న దుస్తుల్లో పడేసింది. దాంతో దుస్తులు అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు కూడా కాలి బూడిదైంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
Go Back to Shorts
Rat
Fire Accident
Cash
Ahmedabad
Gujarat

More Telugu News