వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
- 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు
- వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదు
- 2024 ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కే లేదు
- ఎవరి పల్లకీ మోయడానికి నేను రాలేదు
- జనసేన సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదు. ఇది కొత్త తరం రాజకీయం. పాత తరం కాదు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించి చెప్పా. శ్రీలంకలా ఏపీ అవ్వొద్దనే ఆ మాట అన్నా. నా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వ్యూహం నాకు వదిలేయండి చాలు. నేను ఎవరి పల్లకీ మోయడానికి రాలేదు. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం" అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.