హస్తినలో అమరావతి రైతులు.. పలువురు కేంద్ర మంత్రులతో ప్రత్యేక భేటీలు

amaravati farmers in delhi  tour
  • జ‌గ‌న్ ఢిల్లీ టూర్ నాడే హ‌స్తిన‌లో రైతుల ప్ర‌త్య‌క్షం
  • న‌లుగురు కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్న వైనం
  • కేంద్ర ప్రభుత్వ అధికారుల‌తోనూ భేటీ అయ్యే అవ‌కాశం
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల‌తో భేటీ కోసం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన నాడే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు కూడా ఢిల్లీలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న అమ‌రావ‌తి జేఏసీ నేత‌లు ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

అమ‌రావ‌తి జేఏసీ ప్ర‌తినిధులు కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, నరేంద్ర సింగ్ తోమ‌ర్‌, జితేంద్ర సింగ్‌, అశ్వ‌నీ వైష్ణ‌వ్ ల‌తో రైతులు భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత ప‌లువురు కేంద్ర ప్ర‌భుత్వ కీల‌క శాఖ‌ల అధికారుల‌తోనూ భేటీ అయ్యేందుకు రైతులు య‌త్నిస్తున్నారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh
Rajadhani Farners
Delhi Tour

More Telugu News