Tollywood: రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్.. శంకర్ సినిమాలోని ఫొటో లీక్!

Ramcharan Photo Leaks From Shankar Movie
షార్ట్స్‌లో చూడండి
ఆర్ఆర్ఆర్ సక్సెస్ జోష్ లో ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు అదే జోష్ తో శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ తాజాగా లీకైంది. గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడతెట్టి సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫొటో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. అది శంకర్ సినిమాలోనిదేనని అంటున్నారు. 

సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు షేడ్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. 1980ల నాటి రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. దానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ కథకు చెందిన ఫొటోనే ఇదని అంటున్నారు. ఇక, తండ్రి బాటలోనే ఐఏఎస్ గా ఉన్న తనయుడు కూడా రాజకీయ నాయకుడిగా మారతాడట. కథ మాట అటుంచితే ఈ ఫొటోను రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

రుద్రవీణ సినిమాలో తెల్లని వస్త్రాల్లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే చిరంజీవిని రామ్ చరణ్ గుర్తుకుతెప్పించాడని అంటున్నారు.
Go Back to Shorts
Tollywood
Shankar
Ramcharan

More Telugu News