'పుష్ప 2' విషయంలో బన్నీ అలా ప్లాన్ చేశాడట!
- సంచలన విజయం సాధించిన 'పుష్ప'
- సీక్వెల్ దిశగా కొనసాగుతున్న పనులు
- హిందీ వెర్షన్ షేర్ తీసుకోనున్న బన్నీ?
- త్వరలోనే సెట్స్ పైకి
అడవి నేపథ్యంలో సుకుమార్ ఈ కథను రెడీ చేసుకున్నాడు. ముఖ్యమైన పాత్రలను ఆయన డిజైన్ చేసుకున్న తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ప్రతి పాత్రకు ఆయన సెట్ చేసిన బాడీ లాంగ్వేజ్ .. మేనరిజమ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఈ సినిమా కోసం బన్నీకి భారీ పారితోషికమే ముట్టిందనే టాక్ వచ్చింది.
ఇక 'పుష్ప 2' విషయంలో బన్నీ ముందుగా పారితోషికం తీసుకోకుండా , హిందీ వెర్షన్ షేర్ ను మాట్లాడుకున్నట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే బన్నీ తీసుకునే పారితోషికం కంటే ఎక్కువగానే వస్తుంది. రష్మిక కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో, దిశా పటాని స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందని అంటున్నారు.