India: ఇండియాలో వెయ్యి లోపే నమోదైన కరోనా కొత్త కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 58 corona deaths in the last 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో కరోనా కేసులు కట్టడిలో ఉన్నప్పటికీ... గత 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య మాత్రం పెరిగింది. కేంద్ర వైద్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 58 మంది మృతి చెందారు. అంతకు ముందు రోజు మృతుల సంఖ్య 13గా ఉండటం గమనార్హం.

ఇక ప్రస్తుతం దేశంలో 12,054 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.17 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. 

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,96,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 79.15 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించారు. 184.87 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News