తెలంగాణలో గత 24 గంటల్లో 12 మందికి కరోనా
- తాజాగా 10,348 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 8 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 49 మంది
- ఇంకా 290 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,328 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,927 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 290 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
