రంజాన్ నేపథ్యంలో.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు
- శనివారంతో మొదలైన రంజాన్ మాసం
- మే 2 వరకు కొనసాగనున్న ఉపవాసాలు
- సాయంత్రం గంట ముందుగానే ఇంటికి ముస్లిం ఉద్యోగులు
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నెల మొత్తం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం వేళ ముస్లిం ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రార్థనలు కొనసాగించేందుకు సాయంత్రం గంట ముందుగానే ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరికీ వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.