ఉగాది పచ్చడి చేసిన కల్వకుంట్ల కవిత... ఫొటోలు ఇవిగో!
- ఉగాది వేళ పచ్చడి చేసిన కవిత
- దేవుడి గదిలో కూర్చుని పచ్చడి చేసిన వైనం
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
ఈ ఏడాది ఉగాది వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వహస్తాలతో ఉగాది పచ్చడి చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో దేవుడి గదిలో కూర్చుని ఆమె ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ వీడియో విడుదల చేసిన కవిత..తాజాగా ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.