తెలంగాణలో తాజాగా 25 మందికి కరోనా

Telangana corona daily updates
  • గత 24 గంటల్లో 16,839 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 20 కొత్త కేసులు
  • అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 53 మంది
  • ఇంకా 392 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,839 కరోనా పరీక్షలు నిర్వహించగా, 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 53 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,309 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,806 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 392 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Updates
Today Cases

More Telugu News