Ashok Babu: ఎనిమిది మంది ఐఏఎస్ లు దోషులుగా నిలవడం రాష్ట్ర ప్రజలకే అవమానం: ఎమ్మెల్సీ అశోక్ బాబు

MLC Ashok Babu comments on IAS officers who pleaded guilty contempt of the court
  • పలువురు ఐఏఎస్ ల కోర్టు ధిక్కరణ
  • శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
  • చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడారన్న అశోక్ 
  • ఇప్పుడెందుకు తలదించుకుంటున్నారని వ్యాఖ్యలు
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించడంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్ లు ఇప్పుడెందుకు తలదించుకుంటున్నారు? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్ లు ఎందుకు పాలకుల అడుగులకు మడుగులు వత్తుతున్నారు? అని నిలదీశారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన సీఎస్ లు కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని విమర్శించారు. 8 మంది ఐఏఎస్ లు దోషులుగా నిలబడడం రాష్ట్ర ప్రజలకే అవమానం అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
Ashok Babu
IAS Officers
AP High Court
Contempt Of The Court
Andhra Pradesh

More Telugu News