Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ .. టీజర్ రిలీజ్!

Calling Sahasra Teaser Released
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'కాలింగ్ సహస్ర'
  •  సుధీర్ జోడీగా షాలు చౌరాసియా 
  • దర్శకుడిగా అరుణ్ విక్కిరాల 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో వెండితెరపైకి వచ్చిన సుధీర్, ఆ తరువాత హీరోగా ఒక్కో సినిమాను చేస్తూ వెళుతున్నాడు. సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలేవీ అంతగా ప్రేక్షకుల ఆదరణను పొందలేక పోయాయి.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కాలింగ్ సహస్ర' రెడీ అవుతోంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. షాడో మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అరవింద్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. 

బ్రతకడం కోసం చంపడం సృష్టి ధర్మం .. చంపడం తప్పుకానప్పుడు .. దానిని చూపించడం తప్పెలా అవుతుంది? అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. హీరో కొత్తగా ఒక 'సిమ్' తీసుకుంటాడు. అప్పటి నుంచి ఆయన జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకు కారణమేమిటనేదే ఈ కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News