ఏపీ రిజిస్ట్రేషన్ శాఖకు రికార్డు ఆదాయం.. రాష్ట్ర విభజన తర్వాత అత్యధికం ఇదేనట!
- మార్చిలో రిజిస్ట్రేషన్ల శాఖకు వెయ్యి కోట్ల ఆదాయం
- గతేడాది ఇదే నెలతో పోలిస్తే 35 శాతం అధికం
- రియల్ ఎస్టేట్ జోష్‌తోనే ఈ ఆదాయమన్న రజత్ భార్గవ
ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన రజత్ భార్గవ.. మార్చిలో వచ్చిన ఆదాయం గతేడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయాని కంటే 35 శాతం అధికమని తెలిపారు. నిన్నటితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ శాఖకు రూ. 7,327 కోట్ల ఆదాయం రాగా.. గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచకపోయినా..ఈ మేర ఆదాయం పెరిగిందన్న ఆయన.. రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ రావడంతో ఆదాయం పెరిగినట్లు తెలిపారు.