Prime Minister: హై అల‌ర్ట్‌!.. ప్ర‌ధానిని హ‌త్య చేస్తాన‌ని అగంతుకుడి ఈ మెయిల్‌!

unknown person threatens tokill the prime minister narendra modi
  • వీల‌యినంత త్వ‌ర‌గా మోదీని చంపుతా
  • దేశంలో 20 చోట్ల భారీ దాడుల‌కు ప్లాన్‌
  • ఉగ్ర‌వాదుల స‌హ‌కారంతో 20 కిలోల ఆర్డీఎక్స్ సేక‌ర‌ణ‌
  • ఇప్ప‌టికే 20 స్లీప‌ర్ సెల్స్‌ను రంగంలోకి దించా
  • ఈ-మెయిల్ లేఖ‌లో అగంతు‌కుడు వెల్ల‌డి
భారత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని హ‌త్య చేస్తానంటూ గుర్తు తెలియని వ్య‌క్తి  పంపిన ఓ ఈ-మెయిల్ సందేశంతో దేశవ్యాప్తంగా భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తం అయిపోయాయి. నిఘావ‌ర్గాలకు అందిన ఈ  ఈ-మెయిల్ సందేశంలో ఆ గుర్తు తెలియని వ్య‌క్తి ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించాడు.

త‌న వ‌ద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉన్న‌ట్లు వెల్లడించిన అగంతు‌కుడు.. ఆర్డీఎక్స్ సేకర‌ణ‌కు త‌న‌కు కొంద‌రు ఉగ్రవాదులు స‌హ‌క‌రించిన‌ట్టు తెలిపాడు. వీల‌యినంత త్వ‌ర‌గా ప్ర‌ధానిని చంపేస్తాన‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దేశ‌వ్యాప్తంగా 20 చోట్ల దాడుల‌కు కుట్ర చేసిన‌ట్లు అత‌డు వెల్ల‌డించాడు. ఈ దాడుల‌తో దేశంలో 2 కోట్ల మందిని చంపుతానంటూ బెదిరించాడు. ఇందుకోసం చాలా కాలం నుంచే ప‌థ‌కం ర‌చించిన‌ట్టు అత‌డు వెల్ల‌డించారు. ఈ దాడుల కోసం తాను 20 స్లీప‌ర్ సెల్స్‌ను రంగంలోకి దించాన‌ని కూడా ఆ ఆగంతు‌కుడు వెల్ల‌డించాడు.
Prime Minister
Narendra Modi
UNkown Person
E-Mail

More Telugu News