తెలంగాణలో కొత్తగా 32 మందికి కరోనా

Telangana corona daily updates
  • గత 24 గంటల్లో 18,246 కరోనా టెస్టులు
  • హైదరాబాదులో 17 కొత్త కేసులు
  • తాజా మరణాలు నిల్
  • ఇంకా 457 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 18,246 కరోనా పరీక్షలు నిర్వహించగా, 32 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,645 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 457 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates
Today Cases

More Telugu News