ఈ నెల 28, 29 తేదీల్లో భారత్ బంద్... పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు
- కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బంద్
- రెండ్రోజుల పాటు బంద్ చేపట్టాలని కార్మిక సంఘాల నిర్ణయం
- ఇటీవల ఢిల్లీలో సమావేశమైన కార్మికసంఘాలు
- కేంద్రానివి ప్రజావ్యతిరేక చర్యలని తీర్మానం
ఇటీవల ఢిల్లీలో వివిధ కార్మిక సంఘాల నేతలు సమావేశమై, కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, ప్రజలు, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని తీర్మానించారు. ఈ బంద్ లో బ్యాంకింగ్, బీమా రంగ సిబ్బంది కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం, గ్యాస్ ధరలు భగ్గుమంటుండడం వంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.