రంగంలోకి బైడెన్.. ఉక్రెయిన్ మంత్రులతో అమెరికా అధ్యక్షుడి భేటీ
- పోలండ్ పర్యటనకు జో బైడెన్
- వార్సాలో ఉక్రెయిన్ మంత్రులతో భేటీ
- అంతకుముందే పోలండ్ అధ్యక్షుడితోనూ సమావేశం
ఇలాంటి మద్దతు సాధించడంలో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే అమెరికా, నాటో, ఈయూ దేశాల మద్దతు సాధించిన ఉక్రెయిన్.. రష్యాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా మరింతగా ఈ యుద్ధంపై దృష్టి సారించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పొరుగు దేశం పొలండ్‌లో పర్యటనకు బయలుదేరారు.
ఈ పర్యటనలో బైడెన్ పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు అమెరికా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి అందుతున్న సాయం పకడ్బందీగా చేరేలా చూడాలని డుడాను బైడెన్ కోరనున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులతోనూ బైడెన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి, విదేశాల నుంచి ఏ మేర సాయం కావాలన్న కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.