దేశ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' నామ‌స్మ‌ర‌ణ‌.. అభిమానుల ర‌చ్చ‌.. వీడియోలు ఇవిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' నామ‌స్మ‌ర‌ణ‌.. అభిమానుల ర‌చ్చ‌.. వీడియోలు ఇవిగో

rrr fans dance video
  • థియేట‌ర్ల ముందు నానా హంగామా 
  • కొబ్బ‌రికాయ‌లు కొడుతూ అభిమానుల పండుగ
  • హీరోల‌ క‌టౌట్ల‌కు క్షీరాభిషేకాలు
  • కొన్ని థియేట‌ర్లలో తెర ర‌క్ష‌ణ కోసం బారికేడ్లు, ఇనుప చువ్వ‌ల ఏర్పాటు 
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు విడుద‌లైంది. ఆర్ఆర్ఆర్ ఆడుతోన్న‌ థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల ర‌చ్చ మామూలుగా లేదు. దేశ, విదేశాల్లో ఆ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల ముందు నానా హంగామా చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ నామ స్మ‌ర‌ణ‌తో సినీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

థియేట‌ర్ల ముందు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌టౌట్ల‌కు క్షీరాభిషేకాలు చేశారు. అభిమానులు ర‌చ్చ చేస్తార‌ని ముందుగానే ఊహించిన థియేట‌ర్లు వారిని క‌ట్ట‌డి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నాయి. కొన్ని థియేట‌ర్లు తెర ర‌క్ష‌ణ కోసం బారికేడ్లు, ఇనుప చువ్వ‌ల‌ను అమ‌ర్చ‌డం గ‌మ‌నార్హం. ప‌లు ప్రాంతాల్లో బాణ‌సంచా కాల్చుతూ, కొబ్బ‌రికాయ‌లు కొడుతూ, డ్యాన్సులు చేస్తూ అభిమానులు అంబ‌రాన్నంటే సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని థియేట‌ర్ల‌లో 'నాటు నాటు' సాంగు వ‌చ్చిన స‌మ‌యంలో అభిమానులు తెర‌వ‌ద్ద‌కు వెళ్లి డ్యాన్సులు చేశారు. 
      
RRR
Viral Videos
Ramcharan

More Telugu News