Uttar Pradesh: యూపీలో అత్యాచార నిందితుడి ఇంటికి చేరుకున్న బుల్డోజర్.. లొంగిపోయిన నిందితుడు

Policemen park bulldozer near house absconding rapist surrenders
  • ‘బుల్డోజర్ బాబా’గా ఖ్యాతికెక్కిన యోగి ఆదిత్యనాథ్
  • తప్పించుకు తిరుగుతున్న అత్యాచార నిందితుడు
  • నేరుగా బుల్డోజర్‌తో నిందితుడి ఇంటికి
  • గత్యంతరం లేక పోలీసుల ముందుకు నిందితుడు
‘బుల్డోజర్‌ బాబా’గా ప్రసిద్ధికెక్కిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన పంథాతో నేరస్థుల పీఛమణుస్తున్నారు. బుల్డోజర్ అనేది ఇప్పుడు బీజేపీ ఐకాన్‌గా మారిపోయింది. బుల్డోజర్లతో క్రిమినల్స్ పనిపడుతున్న యోగి దెబ్బకు తాజాగా మరో క్రిమినల్ గత్యంతరం లేక పోలీసులకు లొంగిపోయాడు. ఇక, తాజా విషయంలోకి వస్తే.. ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్నాడు. 

పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఓ బుల్డోజర్‌తో అత్యాచార నిందితుడి ఇంటికి చేరుకున్నారు. తొలుత ఇంటి ప్రహరీని కూలగొట్టారు. అప్పటికీ లొంగిపోకపోతే ఇంటిని కూల్చేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన రేపిస్టు మరోమార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చడానికే కాదు.. నేరస్థులను పట్టుకునేందుకు కూడా బుల్డోజర్లు ఉపయోగపడుతున్నాయంటూ ప్రశంసిస్తున్నారు.
Uttar Pradesh
Bulldozer
Rapist

More Telugu News