Junior NTR: 'ఆర్ఆర్ఆర్' చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ మామూలుగా లేదు.. వీడియో ఇదిగో!

Junior NTR reaction after watching RRR movie
  • ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్'
  • హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో సినిమా చూసిన తారక్
  • ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరు
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి సినిమా చూశాడు. ఎన్టీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితుల కోసం ప్రత్యేక షో వేశారు.

ఈ ప్రివ్యూకి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన జూనియర్... 'సినిమా సూపర్' అనే విధంగా థంబ్స్ అప్ చూపించాడు. తారక్ ఎంతో హ్యాపీగా కనిపించాడు. ఆయన రియాక్షన్ చూస్తుంటే... ఇండియన్ సినిమా రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది.
Junior NTR
RRR
Chiranjeevi
Tollywood

More Telugu News