ప‌.గో. జిల్లాలో క‌ల‌క‌లం.. శివాల‌యం ఆవ‌ర‌ణ‌లోనే అర్చ‌కుడిని రాళ్ల‌తో కొట్టి హత్య చేసిన వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌.గో. జిల్లాలో క‌ల‌క‌లం.. శివాల‌యం ఆవ‌ర‌ణ‌లోనే అర్చ‌కుడిని రాళ్ల‌తో కొట్టి హత్య చేసిన వైనం

man kills in wg
  • నిడ‌ద‌వోలు మండ‌లం తాడిమ‌ల్ల‌లో ఘ‌ట‌న‌
  • మృతుడి పేరు వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు  
  • ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ పోలీసులు
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. శివాల‌యం ఆవ‌ర‌ణ‌లోనే అర్చ‌కుడిని కొంద‌రు దుండ‌గులు రాళ్ల‌తో కొట్టి హ‌త్య చేశారు. జిల్లాలోని నిడ‌ద‌వోలు మండ‌లం తాడిమ‌ల్ల‌లో చోటు చేసుకున్న ఈ హ‌త్య స్థానికంగా అల‌జ‌డి రేపుతోంది. మృతుడి పేరు వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు అని, ఆయ‌న అదే శివాల‌యంలో కొంత కాలంగా అర్చ‌కుడిగా పనిచేస్తున్నారని స్థానికులు చెప్పారు. 

ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌ను గుర్తు ప‌ట్టేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
West Godavari District
Crime News

More Telugu News