ధాన్యం కొనుగోళ్లకు కేసీఆర్ సర్కారు సహకరించట్లేదు: కేంద్ర మంత్రి గోయల్
- ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ రచ్చ
- తెలంగాణ నుంచి రా రైస్ కొంటామన్న గోయల్
- కేసీఆర్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ
సోమవారం పార్లమెంటులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన బండి.. తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపైనే చర్చించారు. ఈ సందర్భంగా స్పందించిన గోయల్.. యాసంగి సీజన్ లో కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.