‘కశ్మీర్ ఫైల్స్’ను తప్పకుండా చూస్తా.. భారతీయులు అందరూ చూడాలి: ఆమిర్ ఖాన్ పిలుపు
- సినిమా కథాంశం చరిత్రలో భాగం
- కశ్మీరీ పండిట్లపై జరిగింది దారుణం
- మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది
- సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా ఉందన్న ఆమిర్
1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకుకట్టినట్టు చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. వీరికి తాజాగా ఆమిర్ ఖాన్ జత కలిశారు.
ఢిల్లీలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై స్పందన అడగ్గా.. ‘‘నిజమే, నేను తప్పకుండా ఈ సినిమాను చూస్తాను. ఈ సినిమా కథ చరిత్రలో భాగం. కశ్మీరీ పండిట్ల విషయంలో జరిగింది నిజంగా విచారకరం. అటువంటి అంశంతో కూడిన ఏ సినిమాను అయినా భారతీయులు అందరూ చూడాలి.
మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి భావోద్వేగాలను ఈ సినిమా కదిలించింది. ఈ సినిమాలో ఉన్న అందమైన అంశం అదే. నేను తప్పకుండా ఈ సినిమాను వీక్షిస్తా. ఈ సినిమా విజయం సాధించినందుకు హ్యాపీగా వుంది’’ అని ఆమిర్ తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తీకరించారు.