ప్రజల్లో విభజనకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తుంటుంది... సొంత పార్టీపైనా నింద మోపిన గులాం నబీ ఆజాద్
- 'కశ్మీర్ ఫైల్స్' నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలు
- పార్టీలు ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తాయని వెల్లడి
- ఏ పార్టీని క్షమించబోనని స్పష్టీకరణ
- కశ్మీర్ దుస్థితికి పాకిస్థాన్, ఉగ్రవాదమే కారణమని ఆరోపణ
మతం, కులం తదితర అంశాలను ఉపయోగించుకుని ప్రజల్లో చీలిక తెచ్చేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయని, ఈ విషయంలో తాను కాంగ్రెస్ పార్టీని కూడా వెనుకేసురావడంలేదని తెలిపారు. ఈ అంశంలో తాను ఏ ఒక్క పార్టీని క్షమించబోనని స్పష్టం చేశారు. కశ్మీర్ లో జరిగిన దారుణాల్లో హిందువులు, పండిట్లు, డోగ్రాలు, ముస్లింలు తీవ్రంగా ప్రభావితులయ్యారని ఆజాద్ వివరించారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాల్సి ఉందన్నారు. కశ్మీర్ దుస్థితికి పాకిస్థాన్, ఉగ్రవాదం ప్రధాన కారణాలు అని అన్నారు.