రూ.150 కోట్ల వసూళ్లకు చేరువలో ‘ది కశ్మీర్ ఫైల్స్’.. కొనసాగుతున్న దూకుడు
Add ap7am to your home Screen

రూ.150 కోట్ల వసూళ్లకు చేరువలో ‘ది కశ్మీర్ ఫైల్స్’.. కొనసాగుతున్న దూకుడు

The Kashmir Files box office collection inches closer to Rs 150 crore mark
  • 1990లో కశ్మీర్ వలసల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’
  • విడుదలైన వారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు
  • 9వ రోజుకు రూ. 140 కోట్లకు చేరుకున్న కలెక్షన్లు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ దూకుడు కొనసాగుతోంది. వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు రూ. 140.95 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రూ. 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది. 

9వ రోజున రూ. 24.50 కోట్లు సాధించింది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు రూ. 140.95 కోట్లకు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఇది రూ. 150 కోట్ల మార్కును దాటుతుందని చెబుతున్నారు. 1990లో కశ్మీర్ తిరుగుబాటు సమయంలో కశ్మీరీ హిందువుల వలసల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్‌ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు.
The Kashmir Files
Bollywood
collections

More Telugu News