ఎల్లారెడ్డిపేట బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ
- గాయపడిన బీజేపీ నాయకులు
- పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్
- హైదరాబాదులోనే అడ్డుకున్న పోలీసులు
- బీజేపీ శ్రేణులకు మంత్రి గంగుల వార్నింగ్
కాగా, ఎల్లారెడ్డిపేట ఘటనపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్ ఎల్లారెడ్డిపేటలో తోట ఆగయ్య ఇంటికి వెళ్లారు.
బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని, అందుకే చాలామంది బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ ఉక్రోషంతోనే బీజేపీ శ్రేణులు తమవారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూపీ, బీహార్, గుజరాత్ సంస్కృతిని పాటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తపై చేయి పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. దాడులతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు.