ICC Womens World Cup 2022: మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఆస్ట్రేలియా

ICC Womens World Cup 2022 Australia Women opt to bowl
  • నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో మిథాలీ సేన
  • వరుస విజయాలతో జోరుమీదున్న ఆసీస్
  • టాప్-4లో నిలవాలంటే భారత్‌కు విజయం తప్పనిసరి
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. టాప్-4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం మిథాలీ సేనకు తప్పనిసరి. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు న్యూజిలాండ్, ఇంగ్లండ్ చేతిలో ఓడి నాలుగు పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

మరోవైపు, ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన మిథాలీ సేన ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలని పట్టుదలతో ఉంది. భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. దీప్తి శర్మ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి వచ్చింది.
ICC Womens World Cup 2022
Auckland
India Women
Australia Women

More Telugu News