The Kashmir Files: బాక్సాఫీసు వద్ద 'కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం... కలెక్షన్ల వివరాలు ఇవిగో!

The Kashmir Files entered into hundred crores club
  • 1990లో కశ్మీర్ లో పండిట్లపై అరాచకాలు
  • భారీగా వలస వెళ్లిన పండిట్లు
  • పండిట్ల గుండెకోతను ప్రతిబింబించేలా ఉన్న కశ్మీర్ ఫైల్స్
  • దేశవ్యాప్తంగా ప్రకంపనలు
  • 7 రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు

నాడు కశ్మీర్లో అరాచక శక్తులు హిందూ పండిట్లపై దారుణాలకు పాల్పడిన ఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, చిన్మయ్ మండ్లేకర్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా, ఓ చిన్న సినిమాగా వచ్చిన కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కశ్మీరీ పండిట్ల గుండెకోతను దర్శకుడు తెరకెక్కించిన విధానం, నటీనటుల ప్రతిభ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. 

కాగా, ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. 7 రోజుల్లో రూ.106.80 కోట్లు వసూలు చేసి కమర్షియల్ సినిమాలకు దీటుగా నిలిచింది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News