Adilabad: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ పాకిస్థాన్‌కు జై కొట్టిన వ్యక్తులపై దాడి.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

Tension prevailed in Adialabad nataraj theatre
  • నటరాజ్ థియేటర్‌లో ఘటన
  • సినిమా చూస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలు
  • థియేటర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ పాకిస్థాన్‌కు జై కొట్టిన ఇద్దరు వ్యక్తులపై ప్రేక్షకులు దాడిచేసిన ఘటన ఆదిలాబాద్‌‌లో జరిగింది. ఇక్కడి నటరాజ్ థియేటర్‌లో నిన్న సినిమాను చూస్తూ ఇద్దరు వ్యక్తులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. గమనించిన కొందరు ప్రేక్షకులు ఆగ్రహంతో వారిపై దాడిచేశారు. దీంతో వారు పరారయ్యారు.

ఈ ఘటనతో థియేటర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయడంతో సినిమా ప్రదర్శన కొనసాగింది. పాకిస్థాన్‌కు జై కొట్టిన వ్యక్తులు మద్యం మత్తులోనే ఆ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News