ఏడుస్తూ ఎంతదూరం నడిచేదాన్నో నాకే తెలియదు: విద్యాబాలన్
- జోరుగా 'జల్సా' సినిమా ప్రమోషన్స్
- కొన్ని సినిమాల్లో అవకాశాలు పొందాను
- చెప్పకుండానే నిర్మాతలు తప్పించారు
- నా రూపాన్ని ఎద్దేవా చేశారు
- నేనేంటన్నది నిరూపించానన్న విద్యాబాలన్
కొంతమంది నిర్మాతలు తమ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చేవారు. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించేవారు. ఆ విషయాన్ని ముందుగా నాకు చెప్పకపోవడం .. ఒక నోటీస్ పంపించకపోవడం నాకు చాలా బాధ కలిగించేది. ఒక నిర్మాత నా రూపాన్ని గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ తరువాత అద్దంలో చూసుకోవడానికి 6 నెలల పాటు భయపడ్డాను.
ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు రోడ్డు మీద ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోయేదానిని. అలా ఎంతదూరం నడిచేదానినో నాకే తెలియదు. నన్ను అవమానించినవారే నేను స్టార్ ను అయిన తరువాత నా డేట్స్ కోసం వస్తే ఇవ్వనని చెప్పాను. నిజం చెప్పాలంటే ఈ రోజున నేను ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఆనాటి అవమానాలే" అని చెప్పుకొచ్చారు.