చెత్త పన్ను చెల్లించనందుకు షాపుల ముందు చెత్త పారబోసిన మునిసిపల్ సిబ్బంది
- కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఘటన
- చెత్త పన్ను వసూలుకు వెళ్లిన సిబ్బంది
- చెత్త పన్నును ఎందుకు చెల్లించాలన్నదుకాణ దారులు
- దుకాణాల ముందు చెత్తను పారబోసిన సిబ్బంది
నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు ఉన్న షాపుల వద్ద చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి మునిసిపల్ సిబ్బంది వెళ్లారు. ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లకు కూడా రుసుము చెల్లిస్తున్నాం కదా? ఇక చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణదారులు సిబ్బందిని ప్రశ్నించారట.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకోగా.. సహనం కోల్పోయిన మునిసిపల్ సిబ్బంది నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను అక్కడికి తెప్పించి దుకాణాల ముందు పారబోసి వెళ్లారు.