Mekapati Goutham Reddy: మేకపాటి నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు బుగ్గనకు అప్పగింత... గవర్నర్ ఆమోదముద్ర

AP governor approves govt proposal for allocating Mekapati portfolios to Bubbana
  • మేకపాటి శాఖలు బుగ్గనకు బదలాయింపు
  • గవర్నర్ కు ప్రతిపాదనలు పంపిన సర్కారు
  • ఆమోదిస్తూ రాజ్ భవన్ ప్రకటన విడుదల 
ఇటీవల ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే. అయితే, మేకపాటి నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలను తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు ప్రతిపాదనలు పంపగా, ఆయన ఆమోదం తెలిపారు.

బుగ్గన ఇప్పటివరకు ఆర్థిక మరియు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇకమీదట ఆయన అదనంగా పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖలను కూడా పర్యవేక్షించనున్నారు. ఈ శాఖలను ఇంతక్రితం మేకపాటి పర్యవేక్షించారు.
Mekapati Goutham Reddy
Buggana Rajendranath
Portfolios
Governor
YSRCP
Andhra Pradesh

More Telugu News