Prabhas: మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ప్రభాస్ 'రాజా డీలక్స్'
- రీసెంట్ గా రిలీజ్ అయిన 'రాధేశ్యామ్'
- నిర్మాణానంతర పనుల్లో 'ఆది పురుష్'
- ముగింపు దశలో 'సలార్'
- సెట్స్ పై ఉన్న 'ప్రాజెక్టు K'
- 'రాజా డీలక్స్'పై త్వరలో ప్రకటన
ప్రభాస్ తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన 'రాధేశ్యామ్' ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తాము ఆశించిన స్థాయి రెస్పాన్స్ ను రాబడుతోందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నుంచి 'ఆది పురుష్' రానుండగా, ముగింపు దశలో 'సలార్' ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని అంటున్నారు.
ఇక 'ప్రాజెక్టు K' కూడా పట్టాలపైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఆ తరువాత సినిమాగా సందీప్ రెడ్డి 'స్పిరిట్' ఉంటుందని అనుకున్నారు. కానీ అంతకంటే ముందుగా మారుతితో 'రాజా డీలక్స్' ఉంటుందని అంటున్నారు. ఇది మాస్ మసాలా ఎంటర్టైనర్ అనేది తాజా సమాచారం.
ఇది బడ్జెట్ పరంగా పాన్ ఇండియా సినిమా కాకపోయినా, ఎంటర్టైన్మెంట్ పరంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసుకునే సినిమానే అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమా తరువాత మారుతి రేంజ్ మారిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం హీరో గోపీచంద్ తో చేసిన 'పక్కా కమర్షియల్'ను రిలీజ్ కి రెడీ చేసే పనిలో ఆయన ఉన్నాడు.