జమ్మూకశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదుల హ‌తం.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప్రాణాల‌తో చిక్కిన‌ మ‌రో ఉగ్ర‌వాది
Add ap7am to your home Screen

జమ్మూకశ్మీర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదుల హ‌తం.. భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప్రాణాల‌తో చిక్కిన‌ మ‌రో ఉగ్ర‌వాది

4 terrorists dies in encounter
  • జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఆపరేష‌న్
  • మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు
  • పుల్వామాలో జైషే మహ్మద్ కమాండర్ కమాల్ భాయ్ హ‌తం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాల సోదాలు కొన‌సాగుతున్నాయి. ఆ క్ర‌మంలో ఈ రోజు ఉద‌యం జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సోదాలు జ‌రుపుతుండ‌గా ఉగ్ర‌వాదులు దాడుల‌కు ప్ర‌య‌త్నించ‌డంతో వారిని బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం నలుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మయ్యారు. 

పుల్వామాలో జైషే మహ్మద్ కమాండర్ కమాల్ భాయ్ ని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఆ ఉగ్ర‌వాది నాలుగేళ్లుగా ఉగ్ర కార్యకలాపాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు వివ‌రించారు. ఇక పుల్వామాలోనే మ‌రో ఉగ్ర‌వాదిని కూడా హ‌త‌మార్చిన‌ట్లు తెలిపారు. మ‌రోవైపు గంధర్ బాల్, హంద్వారాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అంతేగాక‌, మరో ఉగ్రవాదిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప్రాణాలతో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
Jammu And Kashmir
army

More Telugu News