Bheemla Nayak: 'భీమ్లా నాయక్' విడుదల సందర్భంగా మేకను బలిచ్చిన అభిమానులు!... కేసు నమోదు

FIR registered against powerstar fans for alleged animal sacrifice
  • ఇటీవల భీమ్లా నాయక్ రిలీజ్
  • పవర్ స్టార్ అభిమానులపై జంతుబలి ఆరోపణలు
  • చిత్తూరు జిల్లాలో కేసు నమోదు
  • పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్
పవర్ స్టార్ అభిమానులపై జంతుబలి కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా కొందరు వ్యక్తులు మేకను బలిచ్చినట్టు వెల్లడైంది. దీనిపై చిత్తూరు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో, పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

అంతేకాదు, ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. దీనికి సంబంధించిన వివరాలను అషర్ అనే న్యాయవాది సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మేకను బలిస్తున్న ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.
Bheemla Nayak
Release
Animal Sacrifice
FIR
Chittoor District

More Telugu News