Bismah Maroof: తన చంటిబిడ్డతో మ్యాచ్ కు వచ్చిన పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్... టీమిండియా అమ్మాయిలు ఏంచేశారో చూడండి!

Pakistan Women Cricket team captain Bismah Maroof attends match with her infant
  • ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన మారూఫ్
  • న్యూజిలాండ్ లో వరల్డ్ కప్
  • బిడ్డతోటే న్యూజిలాండ్ వచ్చిన వైనం
  • ఫొటోలు, వీడియోలు వైరల్
న్యూజిలాండ్ లో జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో నేడు టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించింది. భారత్ మొదట 244-7 స్కోరు నమోదు చేయగా, పాకిస్థాన్ 137 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ లో జరిగింది. కాగా, ఈ మ్యాచ్ కు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ తన చంటిబిడ్డతో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

మారూఫ్ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, వరల్డ్ కప్ ఎంతో ముఖ్యమైన ఈవెంట్ కావడంతో ఆమె తన పసికందుతో న్యూజిలాండ్ లో అడుగుపెట్టింది. కాగా, ఇవాళ మ్యాచ్ కు తన బిడ్డతో మారూఫ్ వచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా అమ్మాయిలు... మారూఫ్ భుజంపై ఉన్న చిన్నారిని ఎంచక్కా ముద్దు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Bismah Maroof
Child
Match
Team India
World Cup
New Zealand

More Telugu News