Kishan Reddy: వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరు: కిషన్ రెడ్డి

Kishan Reddy fires on CM KCR
  • టీఆర్ఎస్ నాయకత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
  • అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శలు
  • కేసీఆర్ వి తాటాకు చప్పుళ్లు అని వ్యాఖ్యలు
  • బీజేపీ భయపడబోదని స్పష్టీకరణ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ అధినాయకత్వంపై పదునైన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరని అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేయడమే కేసీఆర్ తెచ్చిన మార్పు అని కిషన్ రెడ్డి విమర్శించారు. 

బీజేపీపై కక్షగట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెబుతామని అన్నారు. వరిధాన్యం కొనేది కేంద్రమేనని రైతులకు అర్థమైందని వెల్లడించారు. పొదుపు సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.
Kishan Reddy
KCR
BJP
TRS
Telangana

More Telugu News