RRR: ఏకంగా 75 ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్లు కొన్న ఒక్క‌డు.. ఫొటో వైర‌ల్

rrr movie tickets go viral
షార్ట్స్‌లో చూడండి
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రెండు సార్లు విడుద‌ల‌ వాయిదా పడింది. చివ‌ర‌కు క‌రోనా త‌గ్గ‌డంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

                 
అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ అభిమాని ఒక‌రు ప్రీమియర్ షో కోసం ఏకంగా 75 టికెట్లు కొనడం విశేషం. ఆ టికెట్ల‌కు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.  

Go Back to Shorts
RRR
Ramcharan
Rajamouli

More Telugu News