కాలి నడకన అయినా.. తక్షణమే ఖర్కివ్‌ను వీడాల్సిందే
- నిమిషాల వ్యవధిలోనే రెండు అడ్వైజరీల విడుదల
- వాహనాలు లేకున్నా నడిచి అయినా ఖర్కివ్‌ను వీడాలని సూచన
- క్షేమంగా ఉండాలంటే తక్షణమే ఆ నగరాన్ని వీడాలని హెచ్చరిక
అంతేకాకుండా, తాము సూచించిన మూడు ప్రాంతాలు పెసోచిన్, బబయే, బెజ్ల్‌యుడోవ్‌స్కాలకు ఖర్కివ్ నుంచి ఎంత దూరం ఉంటుందన్న విషయాన్ని వెల్లడించింది. ఖర్కివ్ నుంచి పెసోచిన్ 11 కిలో మీటర్ల దూరం ఉండగా.. బబయే 12 కిలో మీటర్ల దూరంలో, బెజ్ల్‌యుడోవ్‌స్కా 16 కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయని ఎంబసీ తెలిపింది. ఎలాగైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సురక్షితంగా ఉండాలనుకుంటే.. తక్షణమే ఖర్కివ్‌ను వీడాల్సిందేనని ఎంబసీ అధికారులు భారత విద్యార్థులను హెచ్చరిస్తూ కేవలం నిమిషాల వ్యవధిలోనే రెండు అడ్వైజరీలు జారీ చేయడం గమనార్హం.