ర‌ష్యా యుద్ధ ట్యాంక్ ముందుకు వెళ్ల‌కుండా అడ్డుకున్న ఒక్కడు.. వీడియో వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ర‌ష్యా యుద్ధ ట్యాంక్ ముందుకు వెళ్ల‌కుండా అడ్డుకున్న ఒక్కడు.. వీడియో వైర‌ల్

Ukrainian man tries to stop Russian tank with his bare hands
  • ఉక్రెయిన్‌-రష్యా మ‌ధ్య‌ యుద్ధం
  • ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తోన్న ఉక్రెయిన్ పౌరులు
  • బఖ్‌మాచ్ వీధుల్లో యుద్ధ ట్యాంక్
  • తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి య‌త్నించిన వ్య‌క్తి    
ఉక్రెయిన్‌-రష్యా మ‌ధ్య‌ యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ పౌరులు ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సాధారణ పౌరుల నుంచి కూడా ర‌ష్యా సైనికుల‌కు ప్రతిఘటన ఎదురవుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఉక్రెయిన్‌లోని బఖ్‌మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్‌ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేయ‌డానికి య‌త్నించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

మొదట ట్యాంక్ పైకి ఎక్కిన ఆ వ్య‌క్తి.. ఆ త‌ర్వాత కింద‌కు దిగి తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి య‌త్నించాడు. అయినా ట్యాంక్ ముందుకు వెళ్తుండ‌డంతో ట్యాంకు ముందు మోకాళ్ల‌పై నిల‌బ‌డ్డాడు. చివ‌ర‌కు ఆ యుద్ధ ట్యాంకు ముందుకు వెళ్ల‌లేక‌పోయింది. ఈ వీడియోను ఉక్రెయిన్ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. 


    




Ukraine
Russia
Viral Videos

More Telugu News