ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ప్రారంభం
- చర్చలకు తొలుత రష్యానే ప్రతిపాదన
- బెలారస్లో చర్చలకు ఉక్రెయిన్ తొలుత విముఖత
- తాజాగా అక్కడే చర్చలకు అంగీకారం
- చర్చల ఫలితంపై సర్వత్రా ఆసక్తి
రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బెలారస్లో చర్చలకు తాము వ్యతిరేకమంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్చలకు తొలుత రష్యానే ప్రతిపాదన చేయగా.. అందుకు అంగీకరించిన జెలెన్స్కీ చర్చలను బెలారస్లో కాకుండా తటస్థ వేదికపై జరిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. అయితే రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో పరిస్థితి నానాటికీ విషమిస్తున్న నేపథ్యంలో బెలారస్‌లోనే చర్చలకు జెలెన్స్కీ అంగీకరించినట్టు సమాచారం. కాసేపటి క్రితం బెలారస్‌లోనే మొదలైన చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.