CM Jagan: విశాఖలో పర్యటనలో సీఎం జగన్... ఆసక్తికరమైన ఫొటోలు ఇవిగో!

CM Jagan attends naval programs in Vizag
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్-2022 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేశారు. నావల్ డాక్ యార్డులో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని కూడా సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన మిలన్ పరేడ్ ను ప్రారంభించారు. 

ఈ పరేడ్ కు సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ సముద్రంలో నౌకల విన్యాసాలను, గగనతలంలో జెట్ ఫైటర్ విమానాల విన్యాసాలను తిలకించారు. పరేడ్ సందర్భంగా తూర్పు నావికాదళం సీఎం జగన్ కు గౌరవవందనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ నేవీ టోపీ ధరించడం విశేషం. అంతేకాదు, ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిలో ప్రవేశించిన ఆయన దాంట్లోని వ్యవస్థలను ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. 
.
Go Back to Shorts
CM Jagan
Milan International Parade-2022
Vizag
INS Visakhapatnam
INS Vela

More Telugu News