war: ఇది అత్యంత భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌: ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధంపై ట్రంప్‌

trump on ukrain russia war
  • ర‌ష్యా దాడులు చేస్తుండ‌డం అత్యంత పాశ‌విక‌మైన చ‌ర్య 
  • దాడుల‌ను నేను ఖండిస్తున్నాను
  • ఇటువంటి దుశ్చ‌ర్య‌లు ఎప్ప‌టికీ జ‌ర‌గ‌కూడ‌దు

ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్పందించారు. రష్యా అధ్య‌క్షుడు పుతిన్ తో పాటు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ఓ కార్య‌క్ర‌మంలో ట్రంప్ మాట్లాడుతూ... ర‌ష్యా దాడులు చేస్తుండ‌డం అత్యంత పాశ‌విక‌మైన చ‌ర్య అని ఆయ‌న అన్నారు. 

ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తోన్న‌ దాడుల‌ను తాను ఖండిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఆ దాడులను అత్యంత భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌గా ఆయ‌న‌ అభివ‌ర్ణించారు. ఇటువంటి దుశ్చ‌ర్య‌లు ఎప్ప‌టికీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. ర‌ష్యా దాడుల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న‌ ఉక్రెయిన్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తాము ప్రార్థ‌న‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. యుద్ధం స‌మ‌యంలో బైడెన్ తీరు కూడా స‌రిగ్గా లేద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News