Ukraine: కీవ్‌లోకి దూసుకొస్తున్న రష్యా ట్యాంకులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ వ్యక్తి విఫలయత్నం.. వీడియో వైరల్

Ukrainian man tries to stop Russian military convoy as it nears Kyiv
షార్ట్స్‌లో చూడండి
చర్చలకు సిద్ధమంటూనే ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా సేనలు వరుసగా మూడో రోజూ ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దురాక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలు తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఆయుధాలు చేపట్టి రణరంగంలోకి దిగుతున్నారు. మరోవైపు, రష్యన్ల దాడితో భీతావహంగా మారిన దృశ్యాలు సోషల్ మీడియాకెక్కి కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజలు మెట్రో స్టేషన్లు, బంకర్లను షెల్టర్లుగా ఉపయోగించుకుంటున్నారు. 

రాజధాని కీవ్ వైపుగా దూసుకొస్తున్న రష్యా మిలిటరీ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఓ ఉక్రేనియన్ చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో మాతృభూమిని రక్షించుకోవడంపై అతడికి ఉన్న తపనకు అద్దం పడుతోంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాకెక్కి హృదయాలు బరువెక్కిస్తోంది. 

రాజధానివైపుగా దూసుకొస్తున్న యుద్ధ ట్యాంకుల దండును అడ్డుకునేందుకు ఓ వ్యక్తి  ప్రాణాలకు తెగించి వాటికి అడ్డంగా నిల్చున్నాడు. అయితే, ఆ ట్యాంకులు మాత్రం ఆయనను తప్పించుకుంటూ ముందుకు సాగాయి. ఈ క్రమంలో అతడికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకపోవడం గమనార్హం.

ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో దూసుకొస్తున్న ట్యాంకులు అన్నింటికీ అడ్డంగా వెళ్లి నిల్చుని ట్యాంకులు కీవ్‌లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దేశంపై అతడికున్న అభిమానానికి ఈ వీడియో అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘గాడ్ బ్లెస్ యూ బ్రేవ్ మేన్’ అంటూ అతడి ధైర్యానికి జేజేలు పలుకుతున్నారు.
Go Back to Shorts
Ukraine
Russia
War
Russian Tanks
Kyiv

More Telugu News