Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం

PM Modi high level meeting on Russia and Ukraine war
  • ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో సమావేశం 
  • ఉన్నతస్థాయి సమీక్షకు కీలక మంత్రుల హాజరు
  • భారత్ పై తక్షణ ప్రభావంపై చర్చ  
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, శాంతికాముక దేశంగా పేరుగాంచిన భారత్ కు ఇప్పుడు నిజంగా పరీక్షా సమయం అని చెప్పాలి. ఓవైపు రష్యా మిత్రదేశం కావడం, ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేలా ఉండడం భారత్ ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. ప్రస్తుతానికి భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ ఉన్నతస్థాయి సమీక్షలో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ పరిణామాలు, భారత్ పై తక్షణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Narendra Modi
High Level Meeting
Russia
Ukraine
War

More Telugu News