Pawan Kalyan: నా ఆల్ టైమ్ ఫేవరెట్ కొటేషన్లలో ఇది ఒకటి: పవన్ కల్యాణ్

Pawan Kalyan shares his all time favorite quotation
  • ఆసక్తికర కోటేషన్ ను పంచుకున్న పవన్
  • పాస్టర్ నీమోలర్ మాటలు తనకు బాగా ఇష్టమని వెల్లడి
  • ఎంతో గొప్ప సత్యం చెప్పారని కితాబు

జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తనకు బాగా ఇష్టమైన, ఆల్ టైమ్ ఫేవరెట్ కొటేషన్లలో ఒకదాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. జర్మనీ నాజీ నిరంకుశత్వం హయాంలో పాస్టర్ మార్టిన్ నీమోలర్ ఎంతో అణచివేత, బాధ నడుమ వాస్తవికతను ప్రతిబింబించేలా చేసిన వ్యాఖ్యలే ఆ కొటేషన్ అని పవన్ వివరించారు. పాస్టర్ మార్టిన్ నీమోలర్ ప్రవచించిన ఆ కొటేషన్ ను ఓ పిక్ రూపంలో తన ట్వీట్ లో పొందుపరిచారు. నిజంగా ఆయన చాలా గొప్ప సత్యం చెప్పారని కీర్తించారు.

"వాళ్లు మొదట సోషలిస్టుల కోసం వచ్చారు... కానీ నేను ఏం మాట్లాడలేదు. ఎందుకంటే నేను సోషలిస్టును కాదు కాబట్టి. వాళ్లు కార్మిక సంఘాల నాయకుల కోసం వచ్చారు... నేను ఏమీ మాట్లాడలేదు... ఎందుకంటే నేను కార్మిక సంఘం నాయకుడ్ని కాదు కాబట్టి. వాళ్లు యూదుల కోసం వచ్చారు... అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు... ఎందుకంటే నేను యూదుడ్ని కాదు కాబట్టి. ఈసారి వాళ్లు నాకోసమే వచ్చారు... అయితే నాకోసం మాట్లాడేందుకు ఒక్కరూ మిగల్లేదు" అంటూ ఆ పాస్టర్ నాటి నాజీ హయాం పరిస్థితులను ఆ కొటేషన్ ద్వారా వివరించారు.

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. కాగా, ఏపీలో జీవో.35 ప్రకారమే టికెట్లు అమ్మాలంటూ థియేటర్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలుగు ఫిలిం చాంబర్ ఆరోపించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News